మరో క్రొత్త మొబైల్ గేమింగ్ డివైజ్ 'ప్లేస్టేషన్ వీటా'

వీటితోపాటు ప్లేస్టేషన్ వీటా ముందు వెనుక భాగాలలో టచ్ పాడ్స్, గేమింగ్‌కి అనుకూలంగా రెండు కెమెరాలు కలిగి ఉందన్నారు. రెగ్యులర్ కన్సోల్ మాదిరే డ్యూయల్ స్టిక్ లేఅవుట్ కలిగి ఉంది. ఐప్యాడ్ మాదిరే ఇందులో కూడా రెండు మోడల్స్ ఉన్నాయి. ఒకటి వై - ఫై టెక్నాలజీ. రెండవది 3జీ కోసం రూపోందించినది. ఇక వీటి ఖరీదు విషయానికి వస్తే వై - ఫై మోడల్ ధర $250 ఉండగా, 3జీ కలిగినటువంటి వీటా మాత్రం $299గా ఉండవచ్చునని వెల్లడించారు.
సోనీ కంపెనీ గేమ్‌ల కోసమే కొన్ని మోడల్స్‌ని విడుదల చేసింది. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ మోడల్స్ ప్లేస్టేషన్ 3. ఆ తర్వాత కొత్తగా రూపోందించినటువంటి ప్లేస్టేషన్ వీటా కోసం కొన్ని గేమ్స్‌ని ప్రత్యేకంగా రూపోందించడం జరిగింది. రెండింటిలోను గేమ్స్ ఆడేటటువంటి విధానం ఒకే విధంగా ఉంటుంది. గేమ్ ఆడేటప్పుడు మీరు గనుక ఏదైనా పని ఉండి ఆపివేసినట్లైతే మరలా అక్కడ నుండే ఆడేటటువంటి అవకాశం ఇందులో ప్రత్యేకం.