పిసిసి చీప్ బొత్సకు మావోల నుండి ముప్పు: ఇంటెలిజెన్స్ హెచ్చరిక

ఇటీవల మావోయిస్టులు దెబ్బతిన్న నేపథ్యంలో వారి నుండి ముప్పు ఉండవచ్చని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. బొత్సకు, ధర్మానకే కాకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోని మరో 20 మంది ప్రజాప్రతినిధులకు కూడా ముప్పు ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల మావోయిస్టులు తమ ప్రధాన క్యాడర్‌ను కోల్పోతున్నారు. దీంతో మావోయిస్టులు ప్రతీకారం తీసుకునే యోచనలో ఉండవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఇంటెలిజెన్స్ లేఖపై బొత్స మండిపడ్డట్టుగా తెలుస్తోంది. కేవలం తమకు లేఖ ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారని ఆరోపించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications