వైయస్ జగన్ మా కుటుంబాన్ని చీల్చలేదు: ఎమ్మెల్యే ధర్మాన

YS Jagan
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ కుటుంబాన్ని చీల్చలేదని శ్రీకాకుళం జిల్లా శాసనసభ్యుడు, మంత్రి ధర్మాన ప్రసాద్ సోదరుడు ధర్మాన కృష్ణదాసు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతోనే తాను వైయస్ జగన్‌కు మద్దతు పలుకుతున్నానని అన్నారు. వైయస్ జగన్ ఎప్పుడు తనను రాజీనామా చేయమని ఆదేశిస్తే అప్పుడు తాను రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంటి దొంగలు అన్న వ్యాఖ్యలు తనకు తెలియదని అయితే ఇంటి దొంగలు బయటకు వెళ్లాలన్న ముఖ్యమంత్రి ఆ ఇంటి దొంగలు ఎవరో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తనను ఉద్దేశించి అన్నవి కావనే తాను అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం తాను కాంగ్రెసు శాసనసభ్యుడిగా కొనసాగుతున్నానని త్వరలో జగన్ పార్టీలో చేరతానని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+