హాస్పిటల్‌లోకి గర్భిణీని అనుమతించని వైద్యులు: ఆరుబయటే ప్రసవం

Karimnagar District
కరీంనగర్: జిల్లాలోని జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. నిండు గర్భిణీని వైద్య సిబ్బంది లోనికి అనుమతించక పోవడంతో ఆమె ఏరియా ఆసుపత్రి ఎదురుగా బయటే శిశువును ప్రసవించింది. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన గర్భిణీ సంధ్య గత కొంత కాలంగా జగిత్యాల హాస్పిటల్‌కు వెళ్లి తన ఆరోగ్యాన్ని పరీక్ష చేయించుకుంటోంది. కొన్ని నెలల క్రితం జగిత్యాల వైద్య సిబ్బంది ఆమెను కరీంనగర్ హాస్పిటల్ వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించగా ఆమె అక్కడకు వెళ్లి పరీక్షలు చేయించకున్నట్టుగా సమాచారం.

అయితే రెండు రోజుల క్రితం ఆమె మళ్లీ జగిత్యాల ఏరియా హాస్పిటల్ వెళ్లి చూపించుకుంది. శిశువుకు నీరు వచ్చిందని చనిపోయిందని వైద్యులు చెప్పారు. అయితే శుక్రవారం ఉదయం ఆమెకు తీవ్రంగా నొప్పులు రావడంతో సంధ్య తల్లిదండ్రులు ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆమెను వైద్యులు హాస్పిటల్లోకి అనుమతించలేదు. దీంతో ఆమె హాస్పిటల్ బయటే శిశువును ప్రసవించింది. శిశువు మరణించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+