నర్సరీ విద్యార్థి గొంతు కోసిన ఆయా కొడుకు, హాస్పిటల్ తరలింపు
Districts
oi-Srinivas G
By Srinivas
|
అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నర్సరీ విద్యార్థి గొంతును అటెండర్ తనయుడు కోసి వేసిన సంఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా పెనుగొండ సిద్దార్థ పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఐదేళ్ల సాయి గొంతును అదే పాఠశాలలో పని చేస్తున్న ఆయా కుమారుడు శివనాయక్ కోశాడు. రక్తం తీవ్రంగా కారడంతో సాయిని అనంతపురం హాస్పిటల్‌కు తరలించారు.
శివనాయక్ గతంలో కూడా మరో విద్యార్థి గొంతు కోసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ప్రమాదకరంగా జరిగిందని స్కూల్ యాజమాన్యం స్పష్టం చేసింది. గతంలో గొంతు కోసినట్లు వస్తున్న ఆరోపణలలో నిజం లేదని చెప్పింది. సాయిని చికిత్స కోసం హాస్పిటల్ తరలించామని చెప్పింది.