వధువు సహా ఆరుగురు మృతి, నెల్లూరు జిల్లాలో పెళ్లి లారీ బోల్తా
Districts
oi-Pratapreddy
By Pratap
|
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో పెళ్లివారి ఇంట విషాదం చోటు చేసుకుంది. పెళ్లి లారీ బోల్తా పడడంతో వధువు సహా ఆరుగురు మృతి చెందారు. నెల్లూరు జిల్లాలోని షార్ సమీపంలోని ఆటకానితిప్ప గ్రామం వద్ద ఆదివారం ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ మద్యం సేవించి ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మృతుల్లో నాలుగేళ్ల పాప కూడా ఉంది. డ్రైవర్ కూడా ప్రమాదంలో మరణించినట్లు అనుమానిస్తున్నారు.
ఓ ఆలయంలో పెళ్లి జరిగిన తర్వాత అంతా తమ సొంత గ్రామానికి బయలుదేరారు. అయితే, లారీ నెల్లూరు వైపు కాకుండా షార్ వైపు వెళ్తున్నట్లు గమనించి డ్రైవర్‌కు చెప్పారు. లారీని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించిన సమయంలో బోల్తా పడింది.