జగన్‌తో జైతెలంగాణ అనిపిస్తా, ఆ తర్వాతే వస్తాం: కొండా సురేఖ

ప్లీనరీలో తెలంగాణపై చర్చించి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా చూస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలుగు భాషే సరిగా రాదు. అలాంటప్పుడు రైతు బాధ ఎలా తెస్తుందని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి, రాష్ట్ర పార్టీ నేతలకు దమ్ముంటే తనను పార్టీ నుండి బయటకు పంపించాలని సవాల్ విసిరారు. కాగా అంతకుముందు కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు వైయస్ఆర్ పార్టీ కార్యకర్తల ఆందోలను అడ్డుకున్న విషయం తెలిసిందే. గతంలో కూడా జగన్ యాత్రను మహబూబ్‌నగర్‌లో అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సురేఖ దాడులనుండి తప్పించుకోవడానికే తెలంగాణపై నిర్ణయం చెప్పకుండా తెలుగుదేశం పార్టీ మాదిరి దాటవేసే ప్రయత్నం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications