హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై చివరి విజ్ఞప్తి, ఆ తర్వాత తడాఖా చూపుతాం: వివేక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్/నల్లగొండ‌: డిసెంబరు 9 నాటి ప్రకటనను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా తమ పార్టీ అధిష్ఠానానికి చివరిసారిగా విజ్ఞప్తి చేస్తామని కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు వివేక్‌ తెలిపారు. 15వ తేదీన కోర్‌ కమిటీ సభ్యులను కలిసి ఇదే విషయాన్ని స్పష్టం చేస్తామని ఆయన సోమవారం హైదరాబాదులో మీడియా ప్రతినిధలతో చెప్పారు. ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందన్న విషయాన్ని ప్రధానికి చెప్పామని ఆయన అన్నారు. కోర్‌ కమిటీ సభ్యుల ముందు కూడా ఆ విషయాన్ని బలంగా చెబుతామని తెలిపారు. అప్పటికి కూడా ఫలితం లేకపోతే కార్యాచరణకు దిగుతామని ఆయన అన్నారు. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి తెలంగాణపై నోరు విప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. జైపాల్‌రెడ్డి ఇప్పటికైనా తెలంగాణ విషయంలో చురుకుగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ కోసం తమ చివరి పోరాటం ఇదేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలో సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ నెల 15వ తేదీన పార్టీ అధిష్టానంతో తెలంగాణపై మాట్లాడి వచ్చిన తర్వాత తమ ఆందోళనా కార్యక్రమాన్ని రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడుతామని, అవసరమైతే పదవులకు రాజీనామాలు చేస్తామని ఆయన అన్నారు.

English summary
Congress Telangana region MP Vivek said that they will make last appeal to his party high command on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X