హైదరాబాద్: డిజిపి అరవింద రావుకు హైకోర్టు నుంచి మంగళవారం ఊరట లభించింది. డిజిపిగా అరవింద రావు నియామకం చెల్లదంటూ క్యాట్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు నాలుగు వారాల పాటు స్టే ఇచ్చింది. దీంతో అరవింద రావు డిజిపిగానే పదవీ విరమణ చేయనున్నారు. ఈ నెల 30వ తేదీన ఆయన పదవీ విరమణ చేయనున్నారు. మరో 15 రోజుల పాటు ఆయన డిజిపిగా కొనసాగడానికి వీలుగా హైకోర్టు స్టే ఉండడంతో అరవింద రావుకు ఊరట లభించింది.
డిజిపి నియామకంలో సీనియారిటీ పాటించలేదని, అందువల్ల డిజిపిగా అరవింద రావు నియామకం చెల్లదని క్యాట్ ఇటీవల తీర్పు వెలువరించింది. దీనిపై హైకోర్టుకు వెళ్లగా అరవింద రావుకు ఊరట లభించింది.