ఖాళీ దొరికినప్పుడు ఓదారుస్తారా: వైయస్ జగన్‌పై బొత్స వ్యంగ్యాస్త్రం

మంత్రివర్గంలో సామాజిక న్యాయం పాటించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని, అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నానని ఆయన అన్నారు. ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తేనే పార్టీ బలంగా ఉంటుందని ఆయన అన్నారు. అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ తనపై ఆరోపణలు చేయడం వల్ల జరిగే నష్టం ఏమీ లేదని, హర్షకుమార్ తన అభిప్రాయం తాను చెప్పారని, బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారని, అది మంచి సంప్రదాయమని ఆయన అన్నారు. వైయస్ జగన్ వెళ్లిపోవడం వల్ల పార్టీకి నష్టం జరిగిందని ఆయన అంగీకరించారు.
తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలపై వాస్తవ పరిస్థితిని తాను పార్టీ అధిష్టానానికి వివరిస్తానని ఆయన అన్నారు. తెలంగాణపై అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని, ఆ నిర్ణయానికి తాము కట్టుబడుతామని ఆయన చెప్పారు. పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్రం నుంచి అధిష్టానం ఐదుగురిని గుర్తించిందని, అందులో భాగంగానే తనకు పిసిసి అధ్యక్ష పదవి అప్పగించారని ఆయన అన్నారు.