ఆధార్‌లో 1కోటికి 20 లక్షల పేర్లు నమోదు: మంత్రి డికె అరుణ

పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. మోడల్ పాఠశాలలకు భవనాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలపై ఉపసంఘంతో విచారణ జరిపిస్తామని చెప్పారు. కౌలుదారులకు ప్రత్యేక చట్టం తీసుకు రావడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. కౌలుదారులకు భూములు దఖలు పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోనేరు కమిటీ సిఫార్సులను అనుసరించి ప్రస్తుతం చేతి వృత్తిదారుల నుండి, రైతుల నుండి వసూలు చేస్తున్న రుణాలు ప్రభుత్వమే చెల్లించే విధంగా చట్టం ఆమోదం పొందిందని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 90 లక్షల బిటి విత్తనాలు అవసరమని అన్నారు. అయితే ఇప్పటికే 60 లక్షల బిటి విత్తనాలు అందాయని మిగిలిన వాటికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications