హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమే: సిపిఐ నేత ఎబి బర్దన్

తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ గతంలో తమ పార్టీ విశాలాంధ్రకు మద్దతు పలికినా సమైక్యాంధ్రలో తెలంగాణకు అన్యాయమే జరిగిందని అభిప్రాయపడ్డారు. ''వ్యవస్థాగత లోపాలు, ప్రస్తుత ఉద్యమాలను గమనంలోకి తీసుకున్న తర్వాత పార్టీ జాతీయ సమితి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాలని తమ పార్టీ నిర్ణయించింది'' అని అన్నారు. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపైన, ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలపైనే సీపీఐ పోరాటం సాగిస్తోంది. అంతేకాని ఆంధ్ర, రాయలసీమ ప్రజలకు వ్యతిరేకంగా మాత్రం కాదని తెలిపారు. ఆ ప్రాంతాల ప్రజలు కూడా అనేక విధాలుగా దోపిడీకి గురవుతున్నారని చెప్పారు. 'కమ్యూనిస్టు పార్టీ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే కమ్యూనిస్టు పార్టీ' అని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications