కాంగ్రెసు కుట్రను గమనించండి: టిఆర్ఎస్‌కు టిడిపి నేత కడియం సలహా

Kadiyam Srihari
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ విషయంలో కాంగ్రెసు కుట్రను తెలంగాణ రాష్ట్ర సమితి గమనించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి కడియం శ్రీహరి సూచించారు. గురువారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం మాట్లాడారు. తెలంగాణ వాదం విషయంలో కాంగ్రెసు కుట్ర పన్నుతోందని కేంద్రమంత్రి చిదంబరం వ్యాఖ్యల ద్వారా అర్థం అయిందని, దీనిని చీటికి మాటికి టిడిపిపై దాడి చేసే వారు అర్థం చేసుకోవాలని అన్నారు. తెలంగాణ వాదాన్ని బలహీనపర్చే కార్యక్రమాలు చేపట్టవద్దని ఆయన టిఆర్ఎస్‌ను హెచ్చరించారు.

తెలంగాణ ప్రజలను కాంగ్రెసు మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ లక్ష్యాన్ని పక్కన పెట్టే విధంగా చర్యలకు పూనుకోవద్దన్నారు. కాగా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బిసిలకు వ్యతిరేకి అని ఆయన మాటల ద్వారా బహిర్గతం అయిందని ఎర్రన్నాయుడు అన్నారు. ఆయనకు రాజకీయ అవగాహన లేదన్నారు. కాగా రైతాంగ సమస్యలపై తెలంగాణ, సీమాంధ్రలలో ఈ నెలలో ఆందోళన చేయాలని టిడిపి పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+