లగడపాటి పార్టీ నుండి వెళ్లిపో!: పొన్నం, మీడియాకు క్లాస్

Ponnam Prabhakar
న్యూఢిల్లీ: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇష్టం ఉంటే పార్టీలో ఉండాలని లేదంటే పార్టీ నుండి వెళ్లి పోవచ్చని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ శనివారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ హెచ్చరించారు. లగడపాటి వంటి కొందరు రాజకీయ, వ్యాపారవేత్తలు తెలంగాణ వాదాన్ని అణిచి వేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తమ సొంత నిర్ణయాలను పార్టీపై రుద్ద కూడదని హెచ్చరించారు. తెలంగాణ ఇస్తుందని అధిష్టానంపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. లగడపాటి వంటి వారు చర్యలకు పార్టీ లొంగదన్నారు. అలాంటి వాటికి పార్టీ భయపడుతుందంటే తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులం అంతకన్నా ఎక్కువే పోరాటం చేస్తామని హెచ్చరించారు. సీమాంధ్ర వ్యాపార రాజకీయ వేత్తలు తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలుసుకోవాలన్నారు.

సీమాంధ్ర ప్రాంతానికి ముఖ్యమైన 4 పదవులు ఇచ్చినా తాము పార్టీని గౌరవిస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ టి-కాంగ్రెసులో ద్రోహులు అన్న విషయంపై ఆయన స్పందిస్తూ ఉంటే ఉండవచ్చునని అయితే వారిని కూడా ఉద్యమంలోకి లాగుతామని చెప్పారు. తాము తెలంగాణ రాష్ట్రం కోసం చిత్తశుద్దితో పని చేస్తున్నామన్నారు. తాము ఇతర పార్టీలలాగా ఏకపక్షంగా వెళ్లడం లేదన్నారు. ఇతర ప్రాతాల వారి ఆమోదంతో, అధిష్టానం ఆమోదంతో తెలంగాణ సాధింపే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు లేవన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఓ దౌర్బాగ్య కమిటీ అన్నారు. పార్టీ నిర్ణయం తెలంగాణకు అనుకూలంగా లేకుంటే ప్రజాభిప్రాయం మేరకు నడుకుంటామని చెప్పారు. తెలంగాణ విషయంలో గూర్ఖాలాండ్ తరహా ఎలాంటి ప్యాకేజీలు తమకు అవసరం లేదన్నారు. తమపై పోటీ పెట్టనని టిఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని చెప్పారు.

పొన్నం మీడియాకు కూడా క్లాస్ పీకారు. మీడియా టి-కాంగ్రెసు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని అన్నారు. ఉత్తర కుమార ప్రగల్భాలు అని, ఉత్తి చేతులతో తిరిగి వచ్చారని ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారని అన్నారు. తెలంగాణకు తాము చిత్తశుద్ధితో పోరాడుతున్నాం అని చెప్పారు. తమకు లోపల ఒకటి బయట ఒకటి లేదన్నారు. అధిష్టానానికి పెట్టిన డెడ్ లైన్లు మారవచ్చు, తేదీలు మారవచ్చు, కానీ తెలంగాణపై మా ఆకాంక్ష మాత్రం మారదన్నారు. ఓ సమయంలో ఆయన అందరికీ దండం పెడతా అని కూడా అన్నారు. తాము రాష్ట్ర పతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్పించామని, నల్లజెండాలతో పార్లమెంటుకు వెళ్లి నిరసన తెలిపామని గుర్తు చేశారు. కాగా పలువురు రాష్ట్ర మంత్రులు న్యూఢిల్లీ రాక పోవడంపై వారు వివరణ ఇచ్చారని వారికి కూడా తెలంగాణ పట్ల సంఘీభావం ఉందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+