వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టి-కాంగ్రెసుకు మళ్లీ ఎదురు దెబ్బ: తెలంగాణపై కోర్ కమిటీలో రాని చర్చ

అయితే తెలంగాణ అంశంపై లేవనెత్తినప్పటికీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ లేనందున చర్చ జరగనట్లు తెలుస్తోంది. దీంతో మీడియా ముందు, తెలంగాణ ప్రజలకు ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి వారికి నెలకొంది. మూడు రోజులుగా న్యూఢిల్లీలో మకాం వేసిన టి-కాంగ్రెసు నేతలకు అన్నీ ఎదురుదెబ్బలే. న్యూఢిల్లీ వెళ్లాక మొదట హోంమంత్రి చిదంబరంతో టి-కాంగ్రెసు నేతలు భేటీ అయ్యారు. అయితే ఆయన వారిని నిరుత్సాహపరుస్తూ పది నిమిషాలలోనే తనకు మరో భేటీ ఉందంటూ బయటకు వచ్చారు. ఆ తర్వాత ప్రణబ్, ఆంటోనీ సమావేశాలలోనూ వారికి తెలంగాణపై హామీ లభించలేదు. సరికదా తెలంగాణ ప్రాంతీయ బోర్డు తెరపైకి వచ్చింది. దీంతో వారు నీరుగారి పోయారు.