జగన్ వర్గం శాసనసభ్యుల అనర్హతలపై స్పీకర్ నాదెండ్ల దృష్టి!

వీటిపై పిటిషన్లు ఇచ్చిన పార్టీల అభిప్రాయాలను కూడా నాదెండ్ల తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పిటిషన్లపై టిడిపి, పిఆర్పీ తమ పిటిషన్‌కు కట్టుబడి ఉండగా కాంగ్రెసులో మాత్రం సందిగ్ధం నెలకొంది. పిటిషన్లను కాంగ్రెస్ శాసనసభపక్షం తరఫున అప్పట్లో ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు, విప్ కొండ్రు మురళీమోహన్‌లు సమర్పించారు. ఇప్పుడు మల్లు డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ప్రభుత్వ చీఫ్ విప్ బాధ్యతలు కూడా కొండ్రు నెత్తికెత్తుకున్నారు. అనర్హత పిటిషన్ల విషయంలో సిఎం కిరణ్ నుంచి మురళికి ఇప్పటికీ స్పష్టమైన ఆదేశాలు రాలేదని సమాచారం. సిఎం తన అభిప్రాయాన్ని వెల్లడిస్తే మురళి ఆ సమాచారాన్ని సిఎల్పీ అభిప్రాయంగా స్పీకర్ మనోహర్ ఎదుట ఉంచే వీలుందని పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications