జగన్ నడమంత్రపు సిరితో ఎగిరి పడుతున్నాడు: చంద్రబాబు వ్యాఖ్య

కాంగ్రెసు పెద్దలు పేదల సొమ్మును పందికొక్కుల్లా దోచుకుని స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిపోయిందని ఆయన అన్నారు. అవినీతిపై ప్రజల్లో చైతన్యం పెరిగితేనే అవినీతిపరులు దారికి వస్తారని ఆయన అన్నారు. ఏడేళ్లలో పేద ప్రజల కోసం కాంగ్రెసు ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని ఆయన అన్నారు. సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెసు ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. సబ్జెక్టు లేకున్నా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఒంటి నిండా అహంకారం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు తాము అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. వెనకబడిన ప్రాంతాలు ఎవరి హయాంలో అభివృద్ధి చెందాయో తేల్చడానికి కాంగ్రెసు బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు.