కామ కోర్కిక తీర్చలేదని ఓ బాలిక కన్ను పోడిచిన దుండగులు

బాలిక ఎడమ కన్నుకి పూర్తిగా గాయమవగా, కుడి కన్నుకి 80శాతం పైగా గాయమైంది. కార్నియా దెబ్బతింటే గతంలో మాదిరి చూడడం కష్టమేనని ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. నిందితులు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) యువజన విభాగానికి చెందిన వారని లక్నో డివిజనల్ కమిషనర్, సెక్రటరీ (సమాచారం) ప్రశాంత్ త్రివేది తెలిపారు. ''బాధితురాలు వాంగ్మూలం ఇవ్వాలని ప్రయత్నించినా పోలీసులు తీసుకోవడానికి నిరాకరించారు. నిందితులిద్దరూ బాలికను తరచూ వేధించేవారు. ఈ సారి ఆమె జీవితానికే ముప్పుతెచ్చారు. వారిని కఠినంగా శిక్షించాలి. వారికి చేసిన తప్పేంటో తెలియాలి. కనీసం ఐదేళ్లు శిక్షించినా మాకు సమ్మతమే'' అని బాలిక తల్లిదండ్రులు తెలిపారు.
కేసుకు సంబంధించి ఎస్సై శివశంకర్, కానిస్టేబుల్ హక్రుద్దీన్‌లను సస్పెండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ సర్కారు ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తిందన్న కాంగ్రెస్ ఆరోపణలను ఖండించింది.












Click it and Unblock the Notifications