అనుచరులే టిడిపి కృష్ణా జిల్లా నేత బాలరామకృష్ణను మట్టు బెట్టారు

Krishna District
విజయవాడ: కృష్ణా జిల్లా చల్లపల్లి జడ్పీటీసీ సభ్యుడు, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు తాతినేని బలరామకృష్ణ(48) ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. స్వగ్రామమైన వక్కలగడ్డలోని దొరవారిగూడెం వద్ద రాత్రి సుమారు 9.20 గంటల సమయంలో చెరువు పూడికతీత పనులను పర్యవేక్షిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. అనుచరులే ఆయనను మట్టు బెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఉదయ్, చిన్ని అనే ఇద్దరు అనుచురులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెబుతున్నారు. వీరిలో ఒకతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరొకతను పరారీలో ఉన్నాడు.

మృతుని భార్య చల్లపల్లిలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు. వారికి రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నారు. హతుడు గతంలో వక్కలగడ్డ సర్పంచిగా కూడా పనిచేశారు. వక్కలగడ్డలో రెండువర్గాల మధ్య ఫ్యాక్షన్‌ గొడవలు 1994 నుంచి కొనసాగుతున్నాయి. తెలుగుదేశం వర్గానికి ప్రస్తుతం తాతినేని బలరామకృష్ణ నాయకత్వం వహిస్తున్నారు. సీపీఐకి చెందిన వారు ప్రత్యర్థి వర్గంగా ఉన్నారు. 1997 నుంచి ఇరువర్గాలు పరస్పరం హత్యలు చేసుకున్న దాఖలాలు లేకపోలేదు. బలరామకృష్ణపై ఇది వరకు రెండుసార్లు హత్యాయత్నం జరిగింది.

తెలుగుదేశం నాయకుడు నానిని కూడా పోలీసులు విచారించారు. అయితే హత్యలో ఆయన పాత్ర లేదని పోలీసులు చెబుతున్నారు. ఇసుక మాఫియా కారణంగానే బలరామకృష్ణ హత్య జరిగినట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+