సిమికోట్‌కు చేరుకున్న మంత్రి కన్నా లక్ష్మినారాయణ బృందం

ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చైనా భూభాగంలోని హిల్సా ప్రాంతంలో వారిని దింపేసి సదరన్ ట్రావెల్స్ వెళ్లి పోయింది. సాయంత్రం వరకు వారు మళ్లీ రాలేదు. అయితే మౌంట్ కైలాష్‌కు వెళ్లాలంటే అక్కడి నుండి గుర్రాల ద్వారా వెళ్ల వలసి ఉంటుంది. మౌంట్ కైలాష్ వెళ్లే పరిస్థితులు లేకుంటే వారిని వెనక్కి తీసుకు రావాల్సి ఉంటుంది. ఇందులో తమ తప్పేమీ లేదని సదరన్ ట్రావెల్స్ ప్రతినిధులు అంటున్నారు. కన్నా లక్ష్మినారాయణ తన పర్యటనను పొడిగించుకున్నారని చెప్పారు. సిమీకోట్ నుంచి కన్నా లక్ష్మినారాయణ బృందం ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాదుకు చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications