వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆఫీస్‌లో ఫేస్‌బుక్ ఎవరికీ తెలియకుండా ఉపయోగించాలంటే.. ఎలా?

ఆఫీస్‌లో మనం ఫేస్‌బుక్ చూస్తున్నామని ఎవరికీ తెలియకుండా ఉండటానికి Excel Book అనే డెస్క్ టాప్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. Excel Book చూడటానికి Excel Spread Sheet లా ఉంటుంది అయినప్పటికీ మనం ఫేస్‌బుక్ చేసే పనులన్నీ ఇక్కడ చెయ్యవచ్చు. అయితే ఫేస్‌బుక్ వాడుతున్నా చూసే వారికి మాత్రం Excel లో ఏదో పని చేస్తున్నామని అనుకుంటారు. Excel Book ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసిన తర్వాత ఫేస్ బుక్ అకౌంట్ తో లాగిన్ చెయ్యాలి. ఫేస్ బుక్ అకౌంట్ నుండి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఇక్కడకు తెచ్చుకోవాలి. సో మరి ఇంకెందుకు ఆలస్యం ఆఫీస్‌లో మీ బాస్ కళ్శు గప్పి ఫేస్‌బుక్ వాడాలంటే Excel Bookని డౌన్ లోడ్ చేసుకోని ఎంచక్కా ఎంజాయ్ చేయండి.