వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికాలో ఎన్ఆర్ఐ జంట భారీ కుంభకోణం: రూ.2070 కోట్ల స్కామ్!

అలెన్ దంపతులకు చెందిన టెక్నోడైన్ కంపెనీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉప కాంట్రాక్టు దక్కించుకుందని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. అలెన్ దంపతులు తమ కంపెనీ వేగంగా వృద్ధి చెందుతున్నట్లుగా చూపారు. కానీ వారు దాదాపు రూ.70 కోట్ల మేర లంచాలు ఇచ్చి అధికంగా బిల్లులు చేయించుకొని పెద్ద సంఖ్యలో అక్రమ ఉప కాంట్రాక్టులు ఇచ్చినట్లు మాన్ హటన్ ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన అభియోగాల్లో పేర్కొన్నారు. రూ.2700 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు తాజా కుంభకోణం వల్ల కళంకితమైనదని విచారణ సంఘం వ్యాఖ్యానించింది. గత ఫిబ్రవరిలో భారత్‌కు వెళ్లిన అలెన్ దంపతులను అదుపులోకి తీసుకునేందుకు దర్యాఫ్తు అధికారులు అనుమతి కోరారని మాన్ హటన్ అటార్నీ జనరల్ తెలిపారు.