ఏడేళ్లలో అంతా మాయం, రాష్ట్రాన్ని దోచిన వారిని రక్షిస్తోంది!: చంద్రబాబు

అవినీతికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. అవినీతి కోరల నుంచి దేశాన్ని విముక్తం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రధానమంత్రిని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకు వచ్చే అంశంపై పార్టీలో చర్చిస్తామని చెప్పారు. అయితే ప్రధానిని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకు రావడంలో తప్పు లేదన్నారు. అవినీతే దేశానికి పెద్ద ముప్పు అన్నారు. అవినీతిపై ప్రభుత్వం కొరడా ఝులిపించాలని సూచించారు. ఇప్పటికే ప్రభుత్వం అవినీతిపై నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. అవినీతిపై అన్నా హజారే చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం అన్నారు. అవినీతిని ఇప్పుడు నిర్మూలించక పోతే ఇంకెప్పుడూ నిర్మూలించ లేమన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహంపై దాడి చేయడం శోచనీయం అన్నారు.












Click it and Unblock the Notifications