హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్యమంత్రి సమీక్షా సమావేశానికి అసంతృప్తితో మంత్రి డుమ్మా

By Pratap
|
Google Oneindia TeluguNews

Kirankumar Reddy
హైదరాబాద్: అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశానికి భారీ నీటి పారదుల శాఖ మంత్రి బి. సుదర్శన్ రెడ్డి డుమ్మా కొట్టారు. జలయజ్ఞం ప్రాజెక్టులకు నిధులు సరిగా విడుదల చేయకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురి కావడం వల్లనే ఆయన బుధవారం ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరు కాలేదని చెబుతున్నారు. వివిధ నీటిపారుదల ప్రాజెక్టుల కిందికి వస్తున్న ప్రజలకు పునరావాసం కల్పించే అంశంపై చర్చించడానికి ఏర్పాటు అయినందున ఆ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం ఉంది.

మంత్రి రాకపోవడంతో ముఖ్యమంత్రి నీటి పారుదల శాఖ అధికారులతోనే సమావేశాన్ని కానిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున మంత్రి సమీక్షా సమావేశానికి రాలేదని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు చెబుతున్నారు. అయితే ఈ మాటలను ఎవరూ నమ్మడం లేదు. సుదర్శన్ రెడ్డి ఇప్పటి వరకు తన శాఖపై పట్టు సాధించలేకపోయారని, నిధుల కొరతతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని, అందువల్లనే సమావేశానికి రాలేదని అంటున్నారు.

English summary
he absence of major irrigation minister B Sudershan Reddy for an important review meeting of the department chaired by chief minister Kiran Kumar Reddy on Wednesday sparked off speculation that the minister was unhappy over scarcity of funds for Jalayagnam projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X