టిఆర్ఎస్ శవ రాజకీయాలు: టిడిపి, జై తెలంగాణ, జై చంద్రబాబు పేరుతో కరపత్రం

తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య జయశంకర్ మృతితో కొందరు శవ రాజకీయాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. శవరాజకీయాలు చేస్తున్న వారితో తగాదాలు ఇష్టం లేకనే జయశంకర్ భౌతికాయాన్ని చూడలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని వారు స్పష్టం చేశారు. జయశంకర్ అందరివాడు అన్నారు. అయితే కొందరు తమ రాజకీయ స్వార్థం కోసం జయశంకర్ ఓ పార్టీకి చెందిన వాడుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో తెలంగాణ తెచ్చేటి, ఇచ్చేటి కాంగ్రెసు పార్టీని వదిలి టిడిపిని టార్గెట్ చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.