సభకు పర్మిషన్ ఇచ్చి ఉంటే ఇంత దూరం వచ్చేదికాదు, కేటీఆర్ వ్యాఖ్యలపైనా పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయ పరిణామాలు మరియు ప్రాంతీయవాదంపై మరోసారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో కొత్తగా ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని సందర్శించిన ఆయన, అక్కడ నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో
తెలంగాణా ప్రాంతం అక్కడి భూమి పుత్రులదే : పవన్ కళ్యాణ్
తాను నిర్వహించ తలపెట్టిన సమావేశానికి అధికారులు సాధారణంగా అనుమతి ఇచ్చి ఉంటే, అది చాలా సాదాసీదాగా ముగిసిపోయేదని, అనవసర వివాదాలకు తావుండేది కాదని జనసేనాని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంతం ఎప్పటికీ అక్కడి భూమిపుత్రులదేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాము ఏపీ నుంచి వెళ్లి అక్కడ రాజకీయం చేయడంలేదని, జనసేన పార్టీ తరఫున తెలంగాణకు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలే ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్నప్పుడు అభ్యంతరం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

జనసేనలోని తెలంగాణ వాసులు అక్కడ పోటీ చేస్తే తప్పా?
తెలంగాణ ప్రజలను గానీ, ఆ గడ్డను గానీ తానెప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కాంక్షించడం వేరని, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం వేరని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి జాతీయ నాయకులు వయనాడ్ వెళ్లి పోటీ చేయగా లేనిది, జనసేనలోని తెలంగాణ వాసులు అక్కడ పోటీ చేస్తే తప్పేంటని నిలదీశారు.
12 సంవత్సరాల నుండి నేను రాను అంటే మా వాళ్ళు పోరు పెట్టారు.
— Icon News (@IconNews247) June 3, 2026
సరే 12 సంవత్సరాలు అయింది కదా అంత ద్వేషం ఉండదు అనుకున్నా.
సభకి పర్మిషన్ ఇచ్చి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు - పవన్ కళ్యాణ్@PawanKalyan @JanaSenaParty #IconNews pic.twitter.com/r0vJaPZ8Wr
కేటీఆర్ సోదరుడి లాంటివాడు
తెలంగాణలో తనకు ఇల్లు ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ, తన సొంత ఇంటికి వెళ్లేందుకు కూడా ఆంక్షలు ఉంటాయా అని ప్రశ్నించారు. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై జనసేనాని సానుకూలంగా స్పందించారు. కేటీఆర్ తనకు సోదరుడి లాంటి వారని, ఆయన తన గురించి తప్పుగా మాట్లాడి ఉండరని భావిస్తున్నట్లు చెప్పారు.
ఇదంతా రేవంత్ రెడ్డికి తెలిసి జరుగుతున్నాయని తాను అనుకోవడం లేదు
మరోవైపు, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిసి జరుగుతున్నాయని తాను అనుకోవడం లేదని.. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలే కావాలని రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలను రేపుతున్నారని ఆరోపించారు. ఇలా సమాజాన్ని విభజించుకుంటూ పోతే భవిష్యత్తులో దేశ సమగ్రతకే ముప్పు వస్తుందని హెచ్చరించిన పవన్, ప్రాంతీయ విద్వేషాలకు స్వస్తి పలికి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలనేదే తమ పార్టీ ఆశయమని స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications