ఆస్తులను వెల్లడించాలని మంత్రులను ఆదేశించిన సిఎం కిరణ్

Kiran Kumar Reddy
హైదరాబాద్: ఆగస్టు నెలాఖరులోగా ఆస్తిపాస్తుల వివరాలు వెల్లడించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రులను, శాసనసభ్యులను ఆదేశించారు. ఈ మేరకు సాధారాణ పరిపాలనా విభాగం మంత్రులకు ఇటీవల సర్క్యులర్ జారీ చేసింది. పారదర్శకత పాటించాలనే ప్రధాని మన్మోహన్ సింగ్ సూచన మేరకు ఆస్తులు వెల్లడించాలని మంత్రులను ఆదేశించినట్లు పాఠశాల విద్యామంత్రి శైలజానాథ్ చెప్పారు. అలాంటి సర్క్యులర్ జారీ చేయడంలో తప్పేమీ లేదని ఆయన అన్నారు.

తప్పనిసరి కాకపోయినా శాసనసభ్యులు తమ ఆస్తిపాస్తుల వివరాలను స్పీకర్‌కు సమర్పించారని, తమ ఆస్తులను అంచనా వేసి జాబితాను సమర్పిస్తామని ఆయన అన్నారు. ఇప్పటికే శాసనసభ్యులు ఆ పని చేశారని, ఇప్పుడు తాము ఆ పని చేస్తామని ఆయన అన్నారు. తాను జులై 15వతేదీన సమర్పించాల్సి ఉండిందని ఆయన చెప్పారు. ఇప్పటికే 2009 వరకు అస్తులను ఎన్నికల సమయంలో అందరూ సమర్పించారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+