చిరంజీవి గ్రూపు రాజకీయాల వ్యూహం, సమన్వయ కమిటీ ఏర్పాటు

ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు వంటి ఇతర పార్టీల్లో చేరకుండా చూడడానికి ఆయన ఐదుగురు సభ్యులతో ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమన్వయ కమిటీ సభ్యులు జిల్లాలవారీగా చర్చలు జరిపి, కాంగ్రెసులోకి వచ్చేలా చూస్తారు. తన వర్గానికి చెందినవారికి ఏదో విధమైన ప్రయోజనం కలిగేలా చూడాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. తనతో పాటు కాంగ్రెసులోకి వచ్చే వారికి ప్రయోజనం చేకూర్చడం వల్ల తనపై నమ్మకం కుదురుతుందని ఆయన భావిస్తున్నారు.
కాగా, రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ప్రజారాజ్యం విలీన సభ తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి.