నాగం, కెసిఆర్ కలిశారు: టిఆర్ఎస్‌లో చేరే విషయంపై చర్చ!

శనివారం ఉదయం ఈటెల రాజేందర్ అసెంబ్లీ ఆవరణలోని పార్టీఎల్పీ కార్యాలయం వద్దనే తన గన్‌మెన్, వ్యక్తిగత సిబ్బందిని వదిలిపెట్టి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కారులో బయటికి వెళ్లారు. వారు నాగం బృందాన్ని కలవటానికే వెళ్లారు. ఈ సందర్భంగానే టిఆర్ఎస్‌లోకి రావాలనే ఆహ్వానాన్ని నాగం, ఆయన బృందానికి ఈటెల, పోచారం అందించారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టిఆర్ఎస్‌లో చేరాలని , ఉప ఎన్నికల్లో వారినే తిరిగి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత తమదేనని కేసీఆర్ దూతలుగా ఈటెల, పోచారం వారికి స్పష్టంచేసినట్లు సమాచారం. అయితే టిఆర్ఎస్‌లో చేరే విషయంలో తమకు కొంత వ్యవధి కావాలని నాగం బృందం కోరినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు కెసిఆర్ నివాసానికి నాగం బృందం వచ్చింది. కెసిఆర్, నాగం భేటీ 3.30 గంటల పాటు సాగింది. అనంతరం ఉమ్మడిగా వీరు మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో పోచారం బాటలోనే టిఆర్ఎస్‌లో చేరబోతున్నారా ? అని నాగంను విలేకరులు ప్రశ్నిస్తే 30 ఏళ్లుగా టిడిపిలోనే ఉన్నాను. ఆ అనుబంధాన్ని వదిలిపెట్టుకునే బయటికి వచ్చాను. టిఆర్ఎస్‌లో చేరాలనే దిశగా ఆలోచించుకోలేదు అని అన్నారు. మళ్లీ ఆయన్ను టిఆర్ఎస్‌లో చేరాలని మిమ్మల్ని కెసిఆర్ కోరారా? అని విలేకరులు ప్రశ్నిస్తే.. మధ్యలో కెసిఆర్ జోక్యం చేసుకొని అన్ని విషయాలు చర్చించాం. సందర్భం వచ్చినప్పుడు నిర్ణయాలు ఉంటాయని అన్నారు.












Click it and Unblock the Notifications