రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కదిలిస్తాం: నారా చంద్రబాబు నాయుడు

రాష్ట్రస్థాయిలో ధరల నిర్ణాయక సంఘాలు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినతిపత్రాలు ఇస్తామని వెల్లడించారు. రైతు సమస్యలపై దేశవ్యాప్తంగా అన్ని పార్టీల మద్దతు కూడగడతామని తెలియజేశారు. వ్యవసాయ ఖర్చులు గత కొన్నాళ్లుగా పెరిగాయన్నారు. అయితే అందుకు అనుగుణంగా ధరలు పెరగడం లేదన్నారు. రైతులకు విత్తన పంపిణీ ఎక్కడా జరగడం లేదన్నారు. రాష్ట్రంలో అసమర్థ పాలన నడుస్తుందన్నారు.
ధాన్యం ధరలపై ఓ కమిటీని ప్రభుత్వం వేయాలన్నారు. వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. కాని రైతులను నష్టం కలిగించరాదన్నారు. దేశవ్యాప్తంగా రైతుల సమస్యలను పరిష్కరించడానికి జాతీయస్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడగడతామన్నారు.












Click it and Unblock the Notifications