ఇతరులతో తిరగవద్దన్నందుకు భర్తను చంపిన భార్య: బయటపెట్టిన కూతురు

Hyderabad
హైదరాబాద్: ఇతరులతో తిరిగి కుటుంబం పరువు మంట కలుపవద్దని వారించినందుకు భర్తను ఓ భార్యే కడతేర్చిన సంఘటన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఆదివారం ఆలస్యంగా బయటపడింది. ఈ విషయాన్ని కన్న కూతురు బయట పెట్టడం మరో విశేషం. ఎల్బీ నగర్‌లో ఉంటున్న విల్సన్, అంజులకు పదమూడేళ్ల క్రితం వివాహం అయింది. వారికి పదకొండేళ్ల సోని అనే కూతురు కూడా ఉంది. అయితే ఇటీవల కొద్దికాలంగా అంజుల ఇతరులతో కలిసి చెడు తిరుగుళ్లు తిరుగుతుంది. దీంతో భర్త విల్సన్ అలా తిరగవద్దని వారించారు. కూతురు కోసమైనా అలాంటివి మానుకోవాలని హెచ్చరించారు.

భర్త మందలింపును సహించని భార్య అంజుల ఐదు రోజుల క్రితం ఈ నెల 21న రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఆయన చేతులు కట్టి వేసింది. ఆ తర్వాత దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఆ తర్వాత ఆ హత్యను సహజమరణంగా చిత్రీకరించింది. తనకు ఏమీ తెలియనట్టు బంధువులకు, చుట్టుపక్కల వారికి ఏడ్చుకుంటూ చెప్పింది. అయితే ఆదివారం వారి కూతురు సోనీ అసలు విషయం బయట పెట్టింది. తన తండ్రిని తల్లే హత్య చేసిందని చెప్పింది.

తన తండ్రి మరణాన్ని కళ్లారా చూసినప్పటికీ తాను ఆ విషయాన్ని బయట పెడితే తనను కూడా చంపేస్తానని తల్లి బెదిరించిందని చెప్పింది. అయితే మనసులోనే తల్లి దుర్మార్గాన్ని దాచుకోలేని సోని తన పిన్నికి ఈ విషయం చెప్పింది. బంధువులు అంతా కలిసి అంజులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ముందు అంజుల తప్పు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+