తెలంగాణ ప్రాంతీయ మండలి చైర్మన్‌గా దామోదర రాజనర్సింహ?

రాష్ట్రానికి అదనపు బలగాలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు, తెలంగాణపై నిర్ణయం ప్రకటించడానికే బలగాలను రాష్ట్రంలో మోహరించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 22 కంపెనీల పారా మిలటరీ బలగాలు మోహరించి ఉన్నాయి. వీటికి అదనంగా ఒక్క రాజధానికి మాత్రమే మరో 15 కంపెనీల బలగాలను పంపుతున్నారు. తెలంగాణలోని కీలకమైన జిల్లాల్లో ఒక్కో జిల్లాకు రెండేసి కంపెనీల చొప్పున మోహరిస్తారని తెలుస్తోంది. ఏడాది కాలంగా వాయిదా వేస్తున్న ఎస్రై రాత పరీక్షలకు హఠాత్తుగా శనివారం రాత్రి తేదీలను ప్రకటించారు. దీన్నిబట్టి తెలంగాణ విషయంలో కఠినంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 120 కంపెనీల కేంద్ర బలగాలను కోరింది. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత 55 కంపెనీల బలగాలను రాష్ట్రానికి తరలించారు. మరో 50 కంపెనీల బలగాలను ఈ నెల 29వ తేదీ లోపు తరలిస్తారని అంటున్నారు. మొత్తం బలగాలను తెలంగాణలోనే మోహరిస్తే తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయం బలపడుతుందని, అందువల్ల ఆరేడు బలగాలను సీమాంధ్రకు తరలించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.