శ్రీశైలం ట్రస్టులో విభేదాలు: చైర్మన్‌పై అవిశ్వాసానికి సభ్యుల మంతనాలు

ఇటీవల ధ్వజస్థంభం ప్రతిష్టాపన చేసిన సమయంలోనూ విభేదాలు పొడసూపినట్లుగా తెలుస్తోంది. ఆరు నెలలుగా చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలపై విసిగిపోయిన ట్రస్టులోని ఏడుగురు సభ్యులు సోమవారం రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే అవిశ్వాస తీర్మానం అంశం దేవాదాయశాఖలో ఉందా లేదా అనే విషయంపై ఏకమైన ఏడుగురు సభ్యులు చర్చిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ దేవాదాయశాఖలో అవిశ్వాస తీర్మానం ఉంటే వారు అందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా అసమ్మతి సభ్యులతో ట్రస్టు చైర్మన్, ఈవో రహస్యంగా మాట్లాడినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications