Stalin vs Vijay: అప్పుడే మొదలుపెట్టేసిన స్టాలిన్..! మాటతప్పిన విజయ్ పై..!

తమిళనాడులో ఎన్నో ఆటంకాల తర్వాత ఎట్టకేలకు తొలిసారి ప్రభుత్వ ఏర్పాటు చేసిన టీవీకే అధినేత విజయ్ కు అప్పుడే సవాళ్లు మొదలైపోయాయి. ఎక్కడో కాదు విజయ్ పాలనకు ఆరు నెలల పాటు సహకరిస్తారనని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ నుంచే. విజయ్ ను అప్పుడే టార్గెట్ చేస్తూ స్టాలిన్ ట్వీట్లు పెట్టడం మొదలుపెట్టేశారు. దీంతో స్టాలిన్ వర్సెస్ విజయ్ (Stalin vs Vijay) వార్ ఆసక్తికరంగా మారింది.

స్టాలిన్ పథకాల కొనసాగింపు పై విజయ్ సంచలన నిర్ణయం, ఉదయనిధి హెచ్చరిక..!!
స్టాలిన్ పథకాల కొనసాగింపు పై విజయ్ సంచలన నిర్ణయం, ఉదయనిధి హెచ్చరిక..!!

తమిళనాడులో గత డీఎంకే ప్రభుత్వ పథకాలన్నీ కొనసాగిస్తానని తాజాగా అసెంబ్లీలో సీఎం విజయ్ ప్రకటించారు. అయితే ఇందులో ఒకటైన మహిళా కళాకారుల నిధి మొత్తాల విడుదల విషయంలో ఆర్దిక పరిస్ధితి సహకరించకపోవడంతో ఆలస్యం చేశారు. ఈ నేపథ్యంలో మే 2026 నెలకు సంబంధించిన మహిళా కళాకారుల నిధి సొమ్ము త్వరలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని సీఎం విజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై డీఎంకే అధినేత స్టాలిన్ ఫైర్ అయ్యారు.

Stalin vs Vijay DMK Chief Demands Release of Promised Artist Women s Rights Fund
Vijay-Udayanidhi: ఉదయనిధికి విజయ్ రిటర్న్ గిఫ్ట్..! అసెంబ్లీలో అరుదైన సన్నివేశం..!
Vijay-Udayanidhi: ఉదయనిధికి విజయ్ రిటర్న్ గిఫ్ట్..! అసెంబ్లీలో అరుదైన సన్నివేశం..!

గౌరవనీయ ముఖ్యమంత్రి గారూ ..మహిళా కళాకారుల హక్కుల పథకానికి మే నెల మొత్తాన్ని 15వ తేదీలోగా జమ చేయాలి అంటూ స్టాలిన్ విజయ్ కు గుర్తుచేశారు.ప్రస్తుతం ఉన్న పథకాన్ని కొనసాగించడానికి ఇప్పుడు ఎందుకింత ఆలస్యం? మీరేం పునర్వ్యవస్థీకరణ చేయాలనుకుంటున్నారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ద్రావిడ ఆదర్శ ప్రభుత్వ (డీఎంకే ) సంక్షేమ పథకాలు కొనసాగుతాయని నిన్న అసెంబ్లీలో మీరే చెప్పలేదా? అని విజయ్ ను ప్రశ్నించారు. నెలకు 2,500 రూపాయలు ఇస్తామని ప్రకటించి, కనీసం 1,000 రూపాయలు కూడా ఇవ్వకుండా కాలయాపన చేయడమేనా మీ మార్పు అని విజయ్ ను స్టాలిన్ నిలదీశారు. దీంతో స్టాలిన్ అప్పుడే విజయ్ ను టార్గెట్ చేసేస్తున్నారంటూ ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+