కత్తులతో నరికి, రాళ్లతో దాడి చేసి హత్య: రాష్ట్రంలో వరుస దారుణాలు

కడప జిల్లా చెన్నూరు మండలం చిన్నమాసుపల్లి గ్రామంలో అల్లుడు తన భార్యను అత్తామామలు కాపురానికి పంపించడం లేదని కత్తితో దాడి చేసి చంపాడు. కొన్నేళ్ల క్రితం కృష్ణాంజనేయులు అనే వ్యక్తికి సుబ్బలక్ష్మి అనే యువతితో వివాహం అయింది. ఆ తర్వాత కాపురంలో వచ్చిన గొడవల కారణంగా సుబ్బలక్ష్మి పుట్టింటికి వచ్చి ఆ తర్వాత కువైట్ వెళ్లి డబ్బు సంపాదించింది. ఆ తర్వాత తిరిగి వచ్చింది. తిరిగి వచ్చి భర్త దగ్గరకు వెళ్లకుండా తల్లిదండ్రుల వద్దనే ఉండి పోయింది. దీంతో ఆగ్రహం చెందిన కృష్ణాంజనేయులు తన భార్య కాపురానికి రాక పోవడానికి కారణం అత్తామామలే అని భావించి వారిపై దాడి చేసి కత్తులతో నరికి చంపాడు.
ఖమ్మం జిల్లాలోని మణుగూరులో ఓ వృద్ధురాలి హత్యలో పాత్ర ఉన్నదని భావించిన ఓ తల్లీకూతుళ్లపై వృద్ధురాలి బంధువులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ తల్లీకూతుళ్లను భద్రాచలం ఆసుపత్రిలో చేర్పించారు. కరీంనగర్ జిల్లాలో ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు, అల్లుడిపై ఓ తండ్రి దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో కమర్షియల్ టాక్సు ఆఫీసరు పైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు మృతి చెందారు.












Click it and Unblock the Notifications