టి-కాంగ్రెసు నేతలకు డెడ్ లైన్ అయిపోయింది: కోదండరామ్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 14 ఎఫ్ రద్దుపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. 14ఎఫ్ తొలగించకుంటే ఉద్యోగులు మళ్లీ సహాయ నిరాకరణకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధుల న్యూఢిల్లీ పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందన్నారు. వారు అంత దూరం వెళ్లి తెలంగాణపై నిర్ణయం కాకుండా ప్రాంతీయ కమిటీని మోసుకు వచ్చారని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలో పోలీసు బలగాలను చూస్తుంటే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications