ఆర్టీసి ప్రయాణికులపై జైపాల్ రెడ్డి దెబ్బ, చార్జీల పెంపు ప్రతిపాదన
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: రాష్ట్ర ఆర్టీసి ప్రయాణికులపై పెట్రోలియం శాఖ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి దెబ్బ పడుతోంది. డీజిల్ ధర పెంపుతో ప్రయాణికుల చార్జీలు పెంచాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ ఆర్టీసి) ప్రతిపాదిస్తోంది. చార్జీల పెంపుపై ఆర్టీసి ఉన్నతాధికారులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో సోమవారం సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితికి బస్సు చార్జీలు పెంచడమే ఏకైక ప్రత్యామ్నాయ పరిష్కారమని ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద రావు అన్నారు.
బస్సు చార్జీల పెంపు అనివార్యమని బొత్స సత్యనారాయణ కూడా మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రయాణికులపై తక్కువ భారం పడేలా పెంపు ప్రతిపాదనలు ఉంటాయని ఆయన అన్నారు. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకునే చార్జీలను పెంచుతామని ఆయన అన్నారు. రెండు, మూడు రోజుల్లో ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటామని, పెంపునకు కసరత్తు చేస్తున్నామని ఆయన అన్నారు.