హైదరాబాద్: సికిందరాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ అన్న కూతురు మయూరిది ఆత్మహత్యే అని పోస్టు మార్టం నివేదిక ద్వారా సోమవారం తెలిసింది. శనివారం మృతిచెందిన మయూరి మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి వైద్యులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా శేరిలింగంపల్లిలోని రాయదుర్గంలో అంజన్ అన్న కూతురు శనివారం మృతి చెందింది. అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే మయూరి తరఫు బంధువులు దీనిని హత్యగా కూడా అనుమానం వ్యక్తం చేశారు.
మయూరి భర్త అర్జున్, ఆమె అత్తామామలు అదనపు కట్నం కోసం తమ కూతురుని హత్య చేసి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించిన విషయం తెలిసిందే. అదనపు కట్నం ఇచ్చేదాకా బంధువుల మయూరిని బంధువుల ఇళ్లకు పంపించలేదని కూడా ఆరోపణలు వినిపించాయి. హత్యకు కోపోద్రిక్తులైన బంధువులు భర్త ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్, కారు, ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ధ్వంసం చేశారు.
Police confirmed that MP Anjan Kumar Yadav's brother daughter Mayuri committed suicide. She died yester day for husband family torcher for extra dowry.
Story first published: Monday, June 27, 2011, 14:27 [IST]