హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాంపల్లి కోర్టుకు శింగనమల: జూలై 11వరకు రిమాండ్ విధించిన కోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Singanamala Ramesh
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌తో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న ప్రముఖ నిర్మాత శింగనమల రమేష్‌ను సిఐడి పోలీసులు సోమవారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు శింగనమలకు జూలై 11వ తేది వరకు రిమాండ్ విధించింది. శింగనమలను ప్రస్తుతం ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వైయజంతీరెడ్డిని చీటింగ్ చేసిన కేసులో నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ప్రధానంగా వైజయంతిరెడ్డి కేసుపై హాజరు పరిచినప్పటికీ తమ కస్టడీలోకి తీసుకొని మద్దెలచెర్వు హత్య కేసుపై కూడా విచారించేందుకు సిఐడి సిద్దమైనట్లుగా తెలుస్తోంది.

వైజయంతిరెడ్డిని రూ.14 కోట్ల వ్యవహారంలో చీటింగ్ చేశారు. శింగనమల, భానుకిరణ్‌తో కలిసి తనను బెదిరించారని వైజయంతిరెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. పులి, ఖలేజా సినిమాల విషయంలో షాలిమార్ కేసు కూడా శింగనమలపై ఉంది. ఇక ముఖ్యంగా భానుకిరణ్‌తో గల సంబంధాలపై పోలీసులు కూపీలాగే ప్రయత్నాలు చేశారు. కాగా చెన్నైలో అరెస్టు చేసిన శింగనమలను ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్ తరలించారు. శింగనమల పేరిట భారీ ఆస్తులు కూడా ఉన్నట్లు పోలీసులు కనుగొన్నట్లు తెలుస్తోంది.

English summary
CID police produced producer Singanamala Ramesh in Nampally court today. Court remanded Singanamala for 11 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X