అమెరికాలో తెలుగు సంఘాల పోటాపోటీ, ఒకే తేదీల్లో మహాసభలు

తానా వేడుకలకు కేంద్రమంత్రి పళ్లంరాజు, రాష్ట్రమంత్రులు గల్లాఅరుణ, మోపిదేవి వెంకటరమణ, తోటనరసింహం, సినీనటులు బాలకృష్ణ, మురళీమోహన్, ఏవీఎస్, సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ, కళాతపస్వి కె.విశ్వనాథ్, జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జున రావు తదితరులు హాజరవుతున్నారు. వీరితో పాటు ఉభయకమ్యూనిస్టు పార్టీల రాష్ట్రనేతలు కె.నారాయణ, బీవీ రాఘవులు వెళ్తున్నారు.
రెండేళ్ల క్రితం 'తానా' నుంచి విడిపోయిన సభ్యులు ఏర్పాటు చేసుకున్న 'ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ'(నాట్స్) వారి ద్వితీయ వార్షికోత్సవాలు ఇదే తేదీల్లో న్యూజెర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తున్నారు. కేంద్రమంత్రి పురందేశ్వరి 30వ తేదీన న్యూజెర్సీకి వస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మంత్రి డీఎల్.రవీంద్రారెడ్డి, ఎంపీ రాజగోపాల్, సినీ ప్రముఖులు బాపు, అశ్వనీదత్, నటులు రాంచరణ్‌తేజ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు హాజరవుతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications