హైదరాబాద్: తెలంగాణ విషయంలో అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఇరుప్రాంతాల వారం ఇప్పటికే చెప్పాల్సినవన్నీ చెప్పామని, త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామని ఆయన అన్నారు. రాజకీయాల్లో ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఎవరికైనా ఉంటుందని, చిరంజీవి ఆ భావం వ్యక్తం చేయడంలో తప్పేమీ లేదని జేసీ బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
కాగా, తెలంగాణకు చట్టబద్దమైన ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని రాయలసీమ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వెనకబడి ఉన్నాయని అంటున్నారు.