ఆంధ్రలో కొని ఢిల్లీలో అమ్మాడు: చిరుపై రేవంత్‌ విమర్శ

Revanth Reddy
హైదరాబాద్: ఆంధ్రలో కొన్ని ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి న్యూఢిల్లీలో అమ్మేసి ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దయతో ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని తెలుగుదేశం పార్టీ యువ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి బుధవారం విమర్శించారు. ముఖ్యమంత్రి పీఠంతో కాంగ్రెసు పార్టీ నేతలు మ్యూజికల్ చైర్ ఆడుతున్నారని అన్నారు. సిఎం పీఠం కాపాడుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి ఓ వైపు ప్రయత్నాలు చేస్తుంటే ఆయన ఎప్పుడు లేస్తే అప్పుడు కూర్చుందామని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎదురు చూస్తున్నారని అన్నారు.

కాంగ్రెసు పార్టీలో తన పార్టీని విలీనం చేసిన చిరంజీవి వారిద్దరు ఎప్పుడు తప్పుకుంటే అప్పుడు ఆ పీఠంపై కూర్చుందామని ఎదురు చూస్తున్నారని అన్నారు. కాంగ్రెసు నేతలు పరిపాలనను, ప్రజలను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి కుర్చీ కోసం, పదవుల కోసం టెన్ జనపథ్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెసు నేతలు అప్లికేషన్ పెట్టుకుంటున్నారని విమర్శించారు. రోజుకు 8 గంటల చొప్పున షిఫ్టుల వైజ్ ముఖ్యమంత్రి కావాలని నేతలు ఎదురు చూస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+