రాహుల్ గాంధీ తెలంగాణకు అనుకూలమా?

గతంలో తెలంగాణకు చెందిన ఎనమండుగురు శాసనసభ్యులను పిలిపించుకుని రాహుల్ గాంధీ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారికి ప్రశ్నలు ఇచ్చి వాటికి సమాధానాలు ఇవ్వాలని అడిగారు. అలాగే, ఉత్తరప్రదేశ్‌ను మూడు ముక్కలు చేస్తే అభివృద్ధి చెందుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసిన సందర్భం కూడా ఉంది. తెలంగాణకు రాహుల్ గాంధీ అనుకూలంగా ఉన్నారనే అభిప్రాయం ప్రచారంలో ఉంది.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలపై, రాష్ట్ర రాజకీయాలపై కూడా రాహుల్ కిరణ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవిపై కూడా ఆయన ముఖ్యమంత్రిని వివరాలు అడిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications