హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అంశం త్వరగా తేల్చాలని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ అంశం వల్ల రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. తెలంగాణపై ఎంత త్వరగా నిర్ణయం తేల్చితే అంత మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. 14ఎఫ్ రద్దు చేయడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదన్నారు. 14ఎఫ్‌ను కేంద్రం వెంటనే రద్దు చేయాలని కోరారు. దీనిపై కేంద్రం జాప్యం చేయవద్దన్నారు.
లోక్‌పాల్ బిల్లును కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రులను కూడా లోక్‌పాల్ పరిధిలోకి తీసుకు రావాలని ఆయన అన్నారు. అయితే ప్రధానమంత్రిని దీని పరిధిలోకి తీసుకు రావాల్సిన అవసరం లేదన్నారు.
Loksatta president Jayaprakash Narayana demanded central government today that to clear telangana issue soon. He said there is no compulsory to change constituency for cancel 14F.
Story first published: Thursday, June 30, 2011, 17:40 [IST]