హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లగడపాటిపై మాట్లాడను: కె కేశవరావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Keshav Rao
హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలపై తానేమీ స్పందించనని కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు కె కేశవరావు గురువారం అన్నారు. తెలుగుదేశం పార్టీ నుండి బహిష్కరింపబడిన శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి తన దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరారని చెప్పారు. ఆయన దీక్షకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ఉద్యమ కార్యాచరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. రాజీనామాలు, దీక్షలపై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదన్నారు. జూలై 1న టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులం సమావేశం అవుతున్నామని చెప్పారు.

శుక్రవారం భేటీలో అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా వ్యూహాత్మకంగా ముందుకు వెళతామని చెప్పారు. పార్లమెంటు సమావేశాలకు ముందు ఉద్యమం తీవ్రతరం చేస్తే లాభిస్తుందనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. టి-కాంగ్రెసు నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. కాగా తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి కూడా నాగం దీక్షకు మద్దతు ప్రకటించింది.

English summary
Congress senior leader K Keshav Rao said today that he will not comment on Vijayawada MP Lagadapati Rajagopal comments. He said that t-congress will met on friday for future plane.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X