ఆస్తి కోసం తల్లి కాళ్లు నరికిన తనయుడు

Warangal District
వరంగల్/కర్నూలు: ఆస్తి కోసం కన్నతల్లి కాళ్లనే ఓ కిరాతక తనయుడు నరికిన సంఘటన వరంగల్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా గూడూరు మండలం తాళ్లపాటితాండకు చెందిన బానోతు కమిలి అనే మహిళ కాళ్లను ఆమె తనయుడు రమేష్ నరికాడు. ఆమెను వెంటనే మహబూబాబాద్ హాస్పిటల్ తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స చేస్తున్నారు. బానోతు కమిలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఆస్తిని తన పేర రాసివ్వాలని రెండో కుమారుడు రమేష్ తల్లిని వేధిస్తున్నాడు. చివరకు గురువారం రోజు ఎంత చెప్పినా ఆస్తి రాసివ్వడం లేదని ఓ కత్తితో కమిలి రెండు కాళ్లను నరికాడు.

కాగా కర్నూలు జిల్లాలో సైతం ఆస్తి కోసం జరిగిన తగాదాలో ఒకరు మరణించిన సంఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ములగుండం గ్రామంలో ఆస్తి కోసం ఇద్దరు అన్నదమ్ములు కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+