హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజారాజ్యం నేతకూ కిలాడీ లేడీ దీపికా రెడ్డి గాలం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Deepika Reddy
హైదరాబాద్: పెళ్లి పేరుతో అమాయక యువకుల నుండి లక్షలు గుంజిన కిలాడీ లేడీ దీపికా రెడ్డి అలియాస్ దీప వలలో ప్రజారాజ్యం పార్టీ నేత కూడా ఒకరు వలలో పడినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నేత చిరంజీవితో కలిసి స్టేజి మీద ఉన్న ఓ ఫోటోను ఓ టీవి ఛానల్ గురువారం ప్రసారం చేసింది. కాగా ఓ ఎన్ఆర్ఐ ఫిర్యాదు కారణంగా దీప పోలీసుల వలలో పడిపోయింది. గుంటూరు జిల్లాకు చెందిన దీప పద్నాలుగేళ్లకే మొదటి పెళ్లి చేసుకుంది. అయితే ఆ పెళ్లి సంవత్సరం తిరగకముందే పెటాకులయి పోయింది. దీప పదిహేనేళ్లకే ఆన్ లైన్ ద్వారా యువకులను మోసం చేయడం ప్రారంభించింది. పదిహేనేళ్ల వయసులో తిరుపతిలో మరొకరిని రెండో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పద్దెనిమిదేళ్లకు బెంగుళూరుకు చెందిన మరొకరిని వివాహం చేసుకుంది. ఆయనపై కట్నం కోసం పీడిస్తున్నాడని కాకినాడలో కేసు పెట్టింది. ఆ తర్వాత అతని నుండి దూరం జరిగింది. ఇలా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న దీప ప్రొపైల్‌ను భారత్ మాట్రి మొనీలో అమెరికాలో సాప్టువేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న సందీప్ రెడ్డి చూశాడు.

పరిచయం చేసుకునేటప్పుడు తాను డాక్టర్‌ను అని, లాయర్‌ను అని యువకులకు చెబుతుంది. సందీప్‌తో కూడా తాను డాక్టర్‌ను అని చెప్పింది. కానీ దీప చదివింది పదో తరగతే. సందీప్‌ను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పింది. అయితే తాను ఓ అనాథ శరణాలయం స్థాపిస్తున్నానని అందుకు కొంత డొనేషన్ కావాలని చెప్పింది. సందీప్ ఆమెకు సుమారు 14 లక్షల రూపాయల వరకు గుంటూరు బ్యాంకులో ఆమె అకౌంట్ పేరిట వేశాడు. తనకు కాబోయే భార్యను చూడాలనుకున్న సందీప్ అమెరికా నుండి హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాదులోనే ఉంటున్న దీపకు ఫోన్ చేశాడు. కానీ నో రెస్పాన్స్. చాలాసార్లు ఆమెకు ఫోన్ చేశాడు. కానీ ఫలితం లేదు.

దీంతో తాను మోసపోయానని భావించిన సందీప్ సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిఐడి పోలీసులు కూడా ఆన్ లైన్‌లో దీపతో పరిచయం పెంచుకొని వల వేసి పట్టుకున్నారు. దీప తాను మోసానికి పాల్పడినట్లు అంగీకరించింది. ఇలా పెళ్లి పేరుతో యువకులను ఆన్ లైన్లో ఎరవేసి డబ్బులు సంపాదించి విచ్చలవిడి జీవితాన్ని గడుపుతుండేది. గుంటూరులోని ఆమె ఇంటిలో అత్యధునిక ఫర్నీచర్ ఉన్నాయి. కాగా గురువారం సాయంత్రం దీపను పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు ఆమెకు 6వ తారీఖు వరకు రిమాండ్ విధించింది.

English summary
Lady khiladi Deepa was from Guntur district. Nampally court remanded her for weekdays.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X