గ్రామాల్లో తిరగనివ్వం: నేతలకు కోదండరామ్ హెచ్చరిక

తెలంగాణకు ప్రత్యేక మండళి, ప్యాకేజీల వంటి వాటికి అంగీకరించేది లేదని తెలంగాణ జెఎసి స్పష్టం చేసింది. అటువంటి ప్రతిపాదనలకు అంగీకారం తెలిపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కోదండరామ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరోదానికి అంగీకరించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీన తెలంగాణ జిల్లాల్లో వంటావార్పూ కార్యక్రమం చేపట్టాలని తెలంగాణ జెఎసి నిర్ణయించింది. మిలియన్ మార్చ్ వంటి కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచన కూడా జెఎసి చేస్తోంది.