వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని ఇష్టం: చిరుకు కేంద్ర మంత్రి పదవిపై ఆజాద్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: తమ పార్టీ నాయకుడు చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే విషయం ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంబంధించిందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అన్నారు. చిరంజీవితో సమావేశమైన అనంతరం ఆయన చిరంజీవితో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చిరంజీవికి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించుకుంటే పార్టీకి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. రాజ్యసభ ఎన్నికలు ఇప్పట్లో లేవని, రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నిక కావాల్సి ఉంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రం రాజకీయాల్లో ఉండాలా, కేంద్ర రాజకీయాల్లో ఉండాలా అనేది చిరంజీవి ఇష్టంపై ఆధారపడి ఉందని ఆయన అన్నారు.

చిరంజీవి తేనీటి విందుకు పిలిస్తే వచ్చానని, చిరంజీవి ఇప్పుడు కాంగ్రెసు అగ్రనేతల్లో ఒకరని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీని బలోపేతం చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ అంశంపై తొందర వద్దని ఆయన పార్టీ తెలంగాణ నాయకులకు సూచించారు. తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి ముందు మరిన్ని అంశాలను పరిష్కరించాల్సి ఉంటుందని, పెద్ద రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను రాజకీయంగా, ఆర్థికంగా సమర్థవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

తెలంగాణ సమస్యను పరిష్కారించడానికి సమయం పడుతుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలతో పాటు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజల మనోభావాలను కూడా గౌరవించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవిస్తామని ఆయన అన్నారు. చిరంజీవితో జరిగిన సమావేశంలో ఆజాద్‌తో పాటు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి ఇంటికి ఆజాద్ నేరుగా వెళ్లారని తెలుసుకున్న బొత్స ఆ తర్వాత తాను వెళ్లి సమావేశంలో కలిశారు.

English summary
Congress AP affairs incharge Ghulam Nabi Azad, who met Chiranjeevi, said that it is PM's prerogative to taje the later into cabinet or not.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X