హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నేను సైతం రాజీనామాకు సిద్ధమని తెలుగుదేశం పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శుక్రవారం సమావేశమై రాజీనామాలకు సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే టిడిపి కూడా రాజీనామాలకు సిద్ధమని ప్రకటించింది. దీంతో నాగం తాను సైతం రాజీనామాకు సిద్ధమని ప్రకటించాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఈ నెల 3, 4 తేదీల్లో తాను దీక్ష చేస్తున్నానని చెప్పారు. ఆ దీక్షా ప్రాంగణం నుండే తాను సభాపతి నాదెండ్ల మనోహర్‌కు రాజీనామాలు పంపిస్తానని చెప్పారు.
కాగా నాగం ఐక్యత దీక్ష పోస్టర్‌ను అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి బోడ జనార్దన్ రెడ్డి విడుదల చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో ఇందిరాపార్క్ వద్ద ఈ నిరసన దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. తాము మద్దతు కోరిన ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు రేపు సంఘీభావం తెలపనున్నట్లు హరీశ్వర్‌రెడ్డి తెలిపారు.
TDP suspended MLA Nagam Janardhan Reddy said today that he will resign on monday for his mla post. He said he will sent his resignation letter from deeksha ground.
Story first published: Friday, July 1, 2011, 17:06 [IST]